Atul Subhash: అతుల్ ఆత్మహత్యతో సెక్షన్ 498ఏపై దేశవ్యాప్త చర్చ.. కీలక విషయాలు వెల్లడించిన అతుల్ లాయర్

Techie Atul Subhash lawyer  has made some key disclosures related to the case
  • అతుల్ నెలకు సంపాదించే రూ. 84 వేలలో రూ. 40 వేలు పోషణ కోసం భార్యకు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశం
  • మిగతా రూ. 44 వేలతో బెంగళూరులో జీవించడం కష్టమన్న భావన
  • ఫ్యామిలీ కోర్టు ఆదేశాలతో సంతృప్తి చెందకుంటే పైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందన్న అతుల్ లాయర్
  • భార్య బాగా సంపాదిస్తుండడంతో ఫ్యామిలీ న్యాయస్థానం అలా ఆదేశించలేదన్న వైనం
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. సెక్షన్ 498ఏపై చర్చకు దారితీసింది. ఈ సెక్షన్ దుర్వినియోగంపై స్వయంగా సుప్రీంకోర్టే ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అతుల్ లాయర్ దినేశ్ మిశ్రా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే  ఆశ్రయించేందుకు మరిన్ని ఫోరమ్‌లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

భార్యాభర్తలిద్దరూ ఆర్థికంగా స్థిరపడినవారేనని, అతుల్ భార్య ఢిల్లీలో బాగానే సంపాదిస్తోందని, బెంగళూరులో అతుల్ నెలకు రూ. 84 వేలు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే, కుమారుడి పోషణ కోసం నెలకు రూ. 40 వేలు చెల్లించాలని అతుల్‌ను కుటుంబ న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిపారు. మిగతా రూ. 44 వేలతో అతుల్ బెంగళూరులో అద్దెలు కట్టుకుని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆమె బాగా సంపాదించి, స్థిరపడి ఉన్నందున విడిపోయిన భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించలేదని లాయర్ దినేశ్ మిశ్రా తెలిపారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలపై అతుల్ సంతృప్తి చెందకుంటే పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. 

అతుల్ ఆత్మహత్యపై అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) నిశాంత్ కేఆర్.శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కఠినమైన, సుదీర్ఘ న్యాయవిచారణ, ఆలస్యమైన న్యాయవిధానం వంటివి ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ 498ఏ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని క్రిమినల్ లాయర్ వికాశ్ పహ్వా తెలిపారు. అతుల్ కేసును ఆయన ‘చాలా తీవ్రమైనది’గా అభివర్ణించారు.  
Atul Subhash
Bengaluru
Software Engineer
Section 498A

More Telugu News