Nayanthara: నయనతారకు మద్రాస్ హైకోర్టు నోటీసులు

Madras High Court serves notices to Nayanathara

  • నయనతార డాక్యుమెంటరీ వివాదం
  • తన అనుమతి లేకుండా సినిమా ఫుటేజీ వాడుకున్నారని ధనుష్ ఆగ్రహం
  • రూ. 10 కోట్లు డిమాండ్ చేసిన ధనుష్

ప్రముఖ సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ లకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నయన్ దంపతులతో పాటు నెట్ ఫ్లిక్స్ కు కూడా నోటీసులు పంపింది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా 'నానుమ్ రౌడీ దాన్' సినిమా ఫుటేజీని వాడుకున్నారంటూ కోలీవుడ్ హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నోటీసులు పంపింది. 

'నానుమ్ రౌడీ దాన్' చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. నయన్ దంపతులకు, నెట్ ఫ్లిక్స్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో ధనుష్ ను నయనతార తప్పుపట్టారు. తనపై ద్వేషం కనపరుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ధనుష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, జనవరి 8వ తేదీలోపు బదుల్వివాలంటూ నయన్ దంపతులు, నెట్ ఫ్లిక్స్ కు మద్రాస్ హైకోర్టు తాజాగా నోటీసులు పంపింది. 

  • Loading...

More Telugu News