Aishwarya Rajesh: ఇక తెలుగు తెరపై ఐశ్వర్య రాజేశ్ హవా!

Aishwarya Rajesh Special

  • దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేశ్
  • అందమైన... ఆకర్షణీయమైన కళ్లు ఆమె సొంతం 
  • వెంకటేశ్ సరసన మెరవనున్న బ్యూటీ
  • సంక్రాంతికి మొదలుకానున్న సందడి  


ఐశ్వర్య రాజేశ్... తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్. అందమైన... ఆకర్షణీయమైన కళ్లు ఆమె సొంతం. తమిళంలో నాయిక ప్రధానమైన సినిమాలు చేయాలంటే నయనతార, త్రిష తరువాత వినిపిస్తున్న పేరు ఆమెదే. తమిళంలోనే కాదు మలయాళ, కన్నడ సినిమాలు చేయడంలోనూ ఆమె ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇక తెలుగులోను అడపాదడపా కనిపిస్తూనే ఉంది. ఐశ్వర్య రాజేశ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి తన సత్తా చాటుకునే పాత్రల కోసం వెయిట్ చేస్తూనే వస్తోంది. 

నిజానికి ఐశ్వర్య రాజేశ్ కి ఉన్న టాలెంట్ కి ఈ పాటికే ఆమె నెక్స్ట్ లెవెల్ ను అందుకోవలసింది... కానీ కాస్త ఆలస్యమైంది. ఓటీటీలో వచ్చిన ' ఫర్హాన'... 'డ్రైవర్ జమున' అనే సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. నటనలో ఐశ్వర్య రాజేశ్ కు వంకబెట్టడం కష్టమేననే విషయం చాలామందికి అర్థమైంది. అలాంటి ఐశ్వర్య రాజేశ్ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. 

వెంకటేశ్ సరసన నాయికగా ఆమె 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను చేసింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇటీవల వెంకటేశ్-ఐశ్వర్య రాజేశ్ కాంబినేషన్లో వచ్చిన 'గోదారి గట్టుమీద' పాట జనంలోకి దూసుకుని వెళ్లింది. గత సినిమాల్లో కంటే ఇందులో మరింత గ్లామరస్ గా ఐశ్వర్య రాజేశ్ మెరిసింది. తెలుగులో ఆమెకి పడిన పెద్ద సినిమా... పెద్ద పాత్రగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక్కడ ఐశ్వర్య రాజేశ్ హవా కొనసాగడం ఖాయమేనని చెప్పుకోవాలి.

  • Loading...

More Telugu News