Virat Kohli: అతడ్ని ఫాలో అవ్వు... కోహ్లీకి గవాస్కర్ సలహా

Gavaskar advises Kohli to follow Sachin

  • ఇటీవల ఆఫ్ స్టంప్ బంతులు ఆడబోయి అవుటవుతున్న కోహ్లీ
  • ఆ బంతులు ఆడకుండా వదిలేయాలన్న గవాస్కర్
  • సచిన్ గతంలో సిడ్నీలో 250 పరుగులు చేశాడని వెల్లడి
  • నాడు సచిన్ ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదని వివరణ
  • సచిన్ ఆలోచనా తీరును అలవర్చుకోవాలని సూచన

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టుల్లో తడబడుతున్న సంగతి తెలిసిందే. టెక్నిక్ లో పెద్దగా లోపాలు లేకపోయినప్పటికీ, ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడడంలో కోహ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు ఇటీవల రెండు టెస్టుల్లో అతడు అవుటైన తీరు చెబుతోంది. 

ఈ నేపథ్యంలో, కోహ్లీ ఫాంపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. క్రీజులో సెటిలయ్యే వరకు ఆఫ్ స్టంప్ కు ఆవల పడే బంతులను ఆడకపోవడమే మంచిదని సూచించాడు. ఈ విషయంలో సచిన్ ఆలోచనా తీరును అలవర్చుకోవాలని కోహ్లీకి సలహా ఇచ్చాడు. 

గతంలో సిడ్నీ టెస్టులో సచిన్ ఆఫ్ స్టంప్ కు అవతల పడే బంతులను ఎలాంటి షాట్లు ఆడకుండా వదిలేశాడని, ఈ ఎత్తుగడ సత్ఫలితాన్ని ఇచ్చిందని, ఆ మ్యాచ్ లో సచిన్ ఆసీస్ పై 250 పరుగులు చేశాడని గవాస్కర్ గుర్తు చేశాడు. ఆ ఇన్నింగ్స్ లో సచిన్ ఆఫ్ సైడ్ ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదని, దాదాపుగా అన్నీ స్ట్రెయిట్ షాట్లే ఆడాడని, తనను తాను అద్భుతంగా నియంత్రించుకుని డబుల్ సెంచరీ సాధించాడని వివరించారు. 

కోహ్లీ కూడా సచిన్ ప్లాన్ ను పాటిస్తే కచ్చితంగా పరుగులు వెల్లువ సృష్టిస్తాడని అభిప్రాయపడ్డాడు. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ లో జరగనుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా, ఆస్ట్రేలియా చెరో టెస్టు నెగ్గి 1-1తో సమంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News