Daaku Maharaaj: బాల‌య్య‌ 'డాకు మ‌హారాజ్' ఫ‌స్ట్ సాంగ్‌ ప్రోమో వ‌చ్చేసింది..!

Daakus Rage Lyric Video Promo from Daaku Maharaaj

  • బాల‌కృష్ణ, బాబీ కాంబోలో 'డాకు మ‌హారాజ్'
  • జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • 'డాకుస్ రేజ్' పేరుతో మూవీలోని ఫ‌స్ట్ సాంగ్‌ ప్రోమో విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం డాకు మ‌హారాజ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. డాకుస్ రేజ్ పేరుతో ఈ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. 'డేగ డేగ' అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలానే ఉంది. తమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా ఈ పాట‌ను నాకాశ్ అజీజ్ అల‌పించారు.

ఇక మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్లుగా శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

  • Loading...

More Telugu News