Bandi Sanjay: మ‌రోసారి బన్నీకి బండి సంజ‌య్ మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ రెడ్డికి కౌంట‌ర్‌!

Minister Bandi Sanjay Counter Attack on CM Revanth Reddy amid Allu Arjun Arrest Row

  • సినిమావాళ్లు చేసేది ప‌క్కా బిజినెస్ అన్న సీఎం రేవంత్‌
  • వాళ్లేమైనా స‌రిహ‌ద్దుల్లో సైనికుల వ‌లే యుద్ధాలు చేస్తున్నారా అంటూ వ్యాఖ్య‌
  • ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా బండి సంజ‌య్ కౌంట‌ర్‌
  • అల్లు అర్జున్‌ను కావాల‌నే అరెస్టు చేశార‌ని మంత్రి విమ‌ర్శ‌

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ మ‌రోసారి అల్లు అర్జున్‌కు మద్ద‌తుగా మాట్లాడారు. అదే స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డికి కౌంట‌ర్ ఇచ్చారు. "సినిమావాళ్లు చేసేది ప‌క్కా బిజినెస్‌. హీరోలు డ‌బ్బులు పెడుతున్నారు.. ఆ త‌ర్వాత సంపాదించుకుంటున్నారు. వాళ్లేమైనా స‌రిహ‌ద్దుల్లో సైనికుల వ‌లే యుద్ధాలు చేస్తున్నారా?" అని నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. 

ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా బండి సంజ‌య్ స్పందించారు. సినిమా ఎప్పుడూ భావోద్వేగాల యుద్ద‌భూమేన‌ని అన్నారు. దేశ‌భ‌క్తి, ఐక్య‌త‌ను సినిమా ప్రేరేపిస్తుందని తెలిపారు. దేశ‌భ‌క్తి కేవలం స‌రిహ‌ద్దుల్లోనే కాదు, ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింప‌డంలో కూడా ఉంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. అనేక సినిమా పాట‌లు దేశాన్ని క‌దిలించాయ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అల్లు అర్జున్‌ను కావాల‌నే అరెస్టు చేశార‌ని, ఆయ‌న విష‌యంలో పోలీసుల నిర్ల‌క్ష్యం స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని బండి సంజ‌య్ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News