Allu Arjun: ఆ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్.. బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటాం: అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ ఘటనలో తన ప్రమేయం లేదన్న అల్లు అర్జున్
- ఒకరు చనిపోవడం దురదృష్టకరమన్న ఐకాన్ స్టార్
- త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి
- అండగా నిలిచిన అభిమానులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన బన్నీ
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్‌గా జరిగిందని ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. గడిచిన 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్‌కి వెళ్లి సినిమా చూశానని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకరు చనిపోవడం దురదృష్టకరం అని, దానికి తాను చింతిస్తున్నానన్నారు.
అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. కుటుంబంతో కలిసి తాను థియేటర్‌లో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక దీనిపై మాట్లాడలేనని బన్నీ అన్నారు.
ఇక అరెస్ట్ సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, మీడియాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అటు తన అరెస్టు వెనక కుట్ర ఉందన్న ప్రచారంపై బన్నీ స్పందించలేదు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపైనా కూడా ఆయన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు.