Asaduddin Owaisi: ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోంది: ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఆగ్రహం

Asaduddin fires at PM Narendra Modi

  • వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదనడంపై ఆగ్రహం
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 చదవాలని ప్రధానికి సూచన
  • మైనార్టీలు అధికారం కలిగి ఉండడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదంటూ విమర్శ

దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 26 చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసే స్వేచ్ఛను ఈ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఒకసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను చదువుకోవాలని సూచించారు. ఇంతకీ ప్రధానికి రాజ్యాంగ పాఠాలు చెబుతోంది ఎవరో చెప్పాలని ఎద్దేవా చేశారు. బలముంది కదా అని వక్ఫ్ ఆస్తులను బలప్రయోగంతో దోచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ భుజానికి ఎత్తుకున్న జాతీయవాదమనేది సాంస్కృతికపరమైది కాదని... అది మతపరమైనదన్నారు. మసీదుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి... మూకదాడుల ద్వారా దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మైనార్టీలు అధికారాన్ని కలిగి ఉండడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదని వాపోయారు.

  • Loading...

More Telugu News