Chandrababu: అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
- మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
- ఈ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ
- ధైర్యంగా ఉండాలని సూచించిన చంద్రబాబు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాత్కాలిక బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో ఆయనను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో అల్లు అర్జున్ తో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. చంద్రబాబు నిన్న అల్లు అరవింద్ కు ఫోన్ చేసి, ఆందోళన చెందవద్దని సూచించిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ తనను ఫోన్ ద్వారా పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బన్నీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవాళ చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. పరామర్శించడానికి వచ్చే సినీ ప్రముఖులతో బన్నీ నివాసం సందడిగా మారింది.