upi: భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు... గణాంకాలు ఇవిగో!

upi achieves historic milestone 15547 crore transactions worth rs 223 lakh crore in 2024

  • దేశంలో యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డు
  • జనవరి నుంచి నవంబర్ వరకూ రూ.15,547 కోట్ల లావాదేవీలు, రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయన్న కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ
  • భారత్ ఆర్ధిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా పయనిస్తోందన్న ఆర్ధిక మంత్రిత్వ శాఖ

భారత్‌లో డిజిటల్ (యూపీఐ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ ఏడాది జరిగిన డిజిటల్ లావాదేవీలను వెల్లడించింది. 

ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ రూ.15,547 కోట్ల లావాదేవీలు జరగ్గా, రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. భారత్ ఆర్ధిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోందని పేర్కొంది. ఇది భారత్ ఆర్ధిక పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.  

  • Loading...

More Telugu News