Allu Arjun: అల్లు అర్జున్ ఆ రాత్రి జైలులో ఏం తిన్నాడు? ఎలా ఉన్నాడు?
- సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
- కోర్టు ఆదేశాలతో ప్రత్యేక ఖైదీగా పరిగణించిన జైలు అధికారులు
- రాత్రి అన్నం, వెజిటబుల్ కర్రీతో భోజనం
- జైలులో అల్లు అర్జున్ మామూలుగానే ఉన్నాడన్నఅధికారులు
పుష్ప-2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఒక రాతంత్రా జైలులోనే గడపాల్సి వచ్చింది. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 8 ఏళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే, ఆ ఉత్తర్వులు జైలు అధికారులకు చేరడంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే గడపాల్సి వచ్చింది.
నటుడు రాత్రి జైలులో విజిటబుల్ కర్రీతో అన్నం తిన్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఇతర నిందితులతో కలిసి అల్లు అర్జున్ను ప్రత్యేకంగా ఉంచినట్టు తెలిపారు. అలాగే, కోర్టు ఆదేశాలతో స్పెషల్ క్లాస్ ప్రిజనర్‌గా ట్రీట్ చేసినట్టు వివరించారు. జైలులో సాధారణంగా సాయంత్రం 5.30 గంటలకే రాత్రి భోజనం వడ్డిస్తారు. అయితే, ఆ తర్వాత జైలుకు వచ్చిన వారికి కూడా ఆహారం అందిస్తారు.
జైలులో అల్లు అర్జున్ సాధారణంగానే గడిపినట్టు అధికారులు తెలిపారు. జైలులో స్పెషల్ క్లాస్ ప్రిజనర్లకు ప్రత్యేకంగా మంచం, టేబుల్, కుర్చీ అందిస్తారు. అయితే, తనకు ఫేవర్‌గా పలానాది చెయ్యాలని అర్జున్ తమను కోరలేదని తెలిపారు. కాగా, నిన్న ఉదయం 6.20 గంటలకు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు.