Budda Venkanna: వారి ఖాతాల్లో ప్రతి నెలా రూ.1.75 లక్షలు పడుతున్నాయి: బుద్ధా వెంకన్న

Budda Venkanna slams YCP MLAs for not attending assembly sessions
  • అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న బుద్ధా వెంకన్న
  • సభకు వెళ్లకుండా జగన్ వారిని అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • జగన్ వైఖరి నచ్చక అనేకమంది బయటికి వస్తున్నారని వెల్లడి
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. శాసనసభకు రాని వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. 

తమ సమస్యలు పరిష్కరిస్తారనే ప్రజలు వారిని గెలిపించారు... ఎమ్మెల్యే వేతనం కింద ప్రతి నెలా రూ.1.75 లక్షలు వారి ఖాతాలో పడుతున్నాయని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను సభకు వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. 

జగన్ వైఖరి నచ్చక అనేకమంది పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారని వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షానే నిలబడ్డారు... మీలాగా పారిపోలేదు అంటూ జగన్ పై విమర్శలు చేశారు.
Budda Venkanna
TDP
YCP MLAs
AP Assembly Session

More Telugu News