Australia vs India: బ్రిస్బేన్ టెస్టు.. మ‌రోసారి టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం.. క‌ష్టాల్లో టీమిండియా!

Australia vs India 3rd Test at Brisbane

  • బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టెస్టు
  • ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్ లో 445 ప‌రుగుల‌కు ఆలౌట్
  • అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌
  • టాప్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యంతో 22 ర‌న్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన భార‌త్

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య‌ జ‌రుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జ‌ట్టు 445 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 22 ప‌రుగుల‌కు 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (4) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఈసారి కూడా మిచెల్ స్టార్క్‌కే త‌న వికెట్‌ను పారేసుకున్నాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన శుభ్‌మాన్ గిల్ (01) కూడా త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేరాడు. 

అటు విరాట్ కోహ్లీ మ‌రోసారి త‌న ఫామ్‌లేమిని కొన‌సాగించాడు. 3 ప‌రుగులే చేసి ఔట‌య్యాడు. జోష్ హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ అవ‌త‌ల ప‌డ్డ బంతిని ఆడ‌బోయి వికెట్ కీప‌ర్ అలెక్స్ కేరీకి దొరికిపోయాడు. దీంతో భార‌త్ లంచ్ స‌మ‌యానికి 3 వికెట్లు కోల్పోయి 22 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (14), రిష‌భ్ పంత్ (03) ఉండ‌గా.. భార‌త్ స్కోర్ 26/3 (9 ఓవ‌ర్లు).

  • Loading...

More Telugu News