SS Rajamouli: 'దేవర' పాటకు డ్యాన్స్ ఇరగదీసిన రాజమౌళి.. ఇదిగో వీడియో!
- దేవర మూవీలోని 'ఆయుధ పూజ' పాటకు జక్కన్న అదిరిపోయే స్టెప్పులు
- మంచి గ్రేస్‌తో డ్యాన్స్ చేసి అందరినీ అలరించిన దర్శకుడు
- కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకలో ఇలా రాజమౌళి డ్యాన్స్
- ఇదే వేడుకలో తన భార్య రమతో కలిసి జక్కన్న డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికే వైరల్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనలో డైరెక్టరే కాదు మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న డ్యాన్స్ వీడియోలే అందుకు ఉదాహరణ. తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన 'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' పాటకు జక్కన్న వేసిన అదిరిపోయే స్టెప్పులకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది.
వీడియోలో ఆయన మంచి గ్రేస్‌తో డ్యాన్స్ చేసి అందరినీ అలరించడం ఉంది. యూఏఈలో జరిగిన సంగీత దర్శకుడు, తన సోదరుడు కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకలో ఆయన ఈ డ్యాన్స్ చేశారు. కాగా, ఇదే పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలా జక్కన్న డ్యాన్స్‌తో ఆకట్టుకోవడం పట్ల నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.