Harish Rao: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారు: అసెంబ్లీలో హరీశ్ రావు

It is said in America that if you go to Telangana you will get Chicken Gunya says Harish Rao

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • కేంద్ర నిధులను ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందన్న హరీశ్ 
  • గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని వ్యాఖ్య

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దీన స్థితిలో సర్పంచ్ లు ఉన్నారని అన్నారు. 

తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారని... ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానమని హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు విడుదల కావడం లేదని చెప్పారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సర్పంచ్ లకు జీతాలు లేవని చెప్పారు. బిల్లులు, జీతాలను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.

తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు క్లియర్ అవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News