Mohan Babu: గ‌న్ అప్ప‌గించిన మోహ‌న్ బాబు

Mohan Babu Surrender his Gun to Police

  • ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి పీఎస్‌లో త‌న గ‌న్‌ను స‌రెండ‌ర్ చేసిన మోహ‌న్ బాబు
  • ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో గ‌న్ స‌రెండ‌ర్ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసుల ఆదేశం
  • ఈరోజు హైద‌రాబాద్ నుంచి చంద్ర‌గిరి వెళ్లి గ‌న్ అప్ప‌గించిన న‌టుడు

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు త‌న లైసెన్స్ గ‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈరోజు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న యూనివ‌ర్సిటీకి వెళ్లారాయ‌న‌. అనంత‌రం చంద్ర‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో త‌న డ‌బుల్ బ్యారెల్‌ లైసెన్స్‌డ్ గ‌న్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో గ‌న్ స‌రెండ‌ర్ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న్ను ఆదేశించ‌డంతో తాజాగా గ‌న్ అప్ప‌గించారు.  

మ‌రోవైపు జ‌ల్‌ప‌ల్లిలో త‌న నివాసం వద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై మోహ‌న్ బాబు తాజాగా మ‌రోసారి మాట్లాడారు. తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌ర్న‌లిస్టుపై దాడి చేయ‌లేద‌న్నారు. ఈ సందర్భంగా మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌ను ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్టును ఆసుప‌త్రికి వెళ్లి మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News