Game Changer: 'గేమ్ ఛేంజ‌ర్' నుంచి మ‌రో సాంగ్‌... కీల‌క అప్‌డేట్ ఇచ్చిన త‌మ‌న్‌!

SS Thaman Tweet on Another Song from Game Changer Movie

  • రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబోలో 'గేమ్ ఛేంజ‌ర్'
  • జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • ఇప్ప‌టికే మూవీ నుంచి 3 పాట‌లు విడుద‌ల‌
  • ఇప్పుడు నాలుగో సాంగ్ విడుదల‌పై త‌మ‌న్ ట్వీట్‌
  • ఈ సాంగ్ 'గేమ్ ఛేంజ‌ర్‌ను సౌండ్ ఛేంజ‌ర్‌'గా మారుస్తుందన్న త‌మ‌న్‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న 'గేమ్ ఛేంజ‌ర్' మూవీ నుంచి మ‌రో సాంగ్ రిలీజ్ కానుంది. దీనిపై సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. త‌ర్వాతి సాంగ్ 'గేమ్ ఛేంజ‌ర్‌ను సౌండ్ ఛేంజ‌ర్‌'గా మారుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ పాట‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 

DHOP అంటూ సాగే ఈ సాంగ్ ఈరోజు సాయంత్రం విడుద‌ల అవుతుంద‌ని, ఆ త‌ర్వాత దీని గురించి ప్ర‌పంచ‌మే మాట్లాడుకుంటుంద‌ని త‌మ‌న్ పేర్కొన్నారు. కాగా, ఇప్ప‌టికే విడుద‌లైన 'జ‌ర‌గండి', 'రా మ‌చ్చా', 'నానా హైరానా' పాట‌లు శ్రోతల‌ను బాగా ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ నాలుగో సాంగ్ వీటికి మించి ఉండ‌డం ఖాయ‌మ‌ని త‌మ‌న్ ట్వీట్ త‌ర్వాత మెగా అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. 

ఇక 'గేమ్ ఛేంజ‌ర్' మూవీ సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. చ‌ర‌ణ్‌ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ త‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని... శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించ‌డం విశేషం. ఎస్. జె సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  

  • Loading...

More Telugu News