Pawan Kalyan: చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కల్యాణ్
- సచివాలయంలో చంద్రబాబును కలవనున్న పవన్
- మంత్రిగా నాగబాబు ప్రమాణం చేసే ముహూర్తంపై చర్చించనున్న పవన్
- నామినేటెడ్ పదవులపై కూడా చర్చించే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు. కీలక అంశాలపై వీరు చర్చించనున్నారు. తన సోదరుడు నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముహూర్తంపై పవన్ చర్చించనున్నట్టు సమాచారం. ఏపీ కేబినెట్లో నాగబాబుకు చంద్రబాబు బెర్త్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే.
నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా? లేక మంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు ఆయన ఎమ్మెల్సీ అవుతారా? అనే విషయంపై పవన్ చర్చించబోతున్నట్టు సమాచారం. నామినేట్ పదవులపై కూడా వీరు చర్చించనున్నారు. జనసేన నుంచి మూడో విడత జాబితాను ముఖ్యమంత్రికి పవన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ఈరోజు పోలవరంలో పర్యటిస్తున్నారు. పర్యటన ముగిసిన అనంతరం నేరుగా ఆయన సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రబాబును పవన్ కలుస్తారు.