Health: మహిళలు ఈ పళ్లు తింటే ఎంతో మేలు!

fruits that have highest iron content

  • సరైన పోషకాహారం లేక రక్తహీనతతో బాధపడుతున్నవారు ఎందరో...
  • ముఖ్యంగా స్త్రీలలో రక్త హీనత సమస్య మరింత ఎక్కువ
  • కొన్ని రకాల పళ్లను తరచూ తీసుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్న నిపుణులు

మన ఆహార అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువైంది. పైగా ఆల్కాహాల్ వంటి అలవాట్లతో మనం తినే ఆహారం నుంచి పోషకాలు శరీరానికి అందకుండా పోతున్నాయి. దానితో చాలా మందిలో ఐరన్ లోపం ఉంటోంది. ఇది రక్త హీనత సమస్యకు దారి తీస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికం. 

రక్త హీనత కారణంగా శరీరంలో నిస్సత్తువ ఆవహిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల మనం తీసుకునే ఆహారంలో భాగంగా కొన్ని రకాల పళ్లను చేర్చుకుంటే... ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలివిగో...

  • మల్బరి పళ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోనివారికి ఇవి ఎక్కువ ప్రయోజనకరం. ప్రతి 100 గ్రాముల మల్బరి పళ్లలో 2.6 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
  • రైజిన్స్ (ఎండు ద్రాక్ష)లలో ప్రతి వంద గ్రాములకు 1.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీనిలోనూ చక్కెరలు ఎక్కువ. అయితే వీటి విషయంలో మధుమేహం వంటివి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
  • ప్రతి వంద గ్రాముల ఖర్జూరాలలో 0.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీనిలో సహజ చక్కెరలు ఎక్కువ. ఉదయం పూట స్నాక్స్ గా తీసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • యాపిల్స్ తోనూ ఐరన్ బాగానే అందుతుంది. ప్రతి వందగ్రాములకు 0.5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
  • పుచ్చకాయ (వాటర్ మెలన్)లో ఐరన్ ఎక్కువే. ప్రతి 100 గ్రాముల వాటర్ మెలన్ లో 0.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పైగా శరీరానికి అదనపు పోషకాలు కూడా అందుతాయి.
  • ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 0.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అంతేకాదు విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ. ఇవి శరీరం ఐరన్ ను బాగా సంగ్రహించేందుకు తోడ్పడుతాయి.
  • కివీ పళ్లలోనూ ప్రతి వంద గ్రాములకు 0.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీనిలో విటమిన్ సీ చాలా ఎక్కువ.
  • అంజీర్ (ఫిగ్స్)లో ప్రతి వంద గ్రాములకు 0.2 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీనిలోని ఫైబర్, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఇదే ఎండబెట్టిన అంజీర్ లో ఐరన్ మరింత ఎక్కువగా లభిస్తుంది.
  • ఎండబెట్టిన (డ్రై) ఆప్రికాట్స్ లో ప్రతి వంద గ్రాములకు 2.7 గ్రాముల ఐరన్ లభిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ శరీరానికి బాగా అందేలా తోడ్పడతాయి.

  • Loading...

More Telugu News