Droupadi Murmu: ఏపీలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
- మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం
- హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము
- ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (డిసెంబరు 17) ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి ముర్ము విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. మంగళగిరిలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.
కాగా, ఈ స్నాతకోత్సవంలో ముర్ము 49 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు, నలుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ముర్ము సాయంత్రం 4.15 గంటలకు గన్నవరం నుంచి హైదరాబాద్ వెళతారు.