Australia vs India: బ్రిస్బేన్ టెస్టు.. కేఎల్ రాహుల్‌కి చేజారిన‌ శ‌త‌కం.. ఫాలోఆన్ గండం ముంగిట భార‌త్‌!

Australia vs India 3rd Test at Brisbane

  • బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టెస్టు
  • నాలుగో రోజు భోజ‌న విరామానికి టీమిండియా స్కోర్‌ 167/6 
  • 84 ప‌రుగులు చేసి ఔట‌యిన కేఎల్ రాహుల్‌
  • మ‌రోసారి నిరాశ‌ప‌రిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
  • మ‌రో 79 ప‌రుగులు చేస్తే టీమిండియాకు త‌ప్ప‌నున్న ఫాలోఆన్ గండం

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. నాలుగో రోజు భోజ‌న విరామానికి భార‌త్ 6 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. ఫాలోఆన్ గండం నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే టీమిండియా మ‌రో 79 ప‌రుగులు చేయాల్సి ఉంది. స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ 84 ప‌రుగులు చేసి సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. 

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 51/4 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భార‌త్ మ‌రో 23 ప‌రుగులు జోడించి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వికెట్ కోల్పోయింది. హిట్‌మ్యాన్‌ కేవ‌లం 10 ర‌న్స్ చేసి పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజాతో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. ఈ క్ర‌మంలో అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. 

84 ప‌రుగులు చేసి సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్న రాహుల్‌ను నాథ‌న్ లైయ‌న్ ఔట్ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 67 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర ప‌డింది. ప్ర‌స్తుతం క్రీజులో జ‌డేజా (41), నితీశ్ కుమార్ రెడ్డి (07) ఉన్నారు. భార‌త్ స్కోర్‌ 167/6 (49 ఓవ‌ర్లు). ఆసీస్ కంటే టీమిండియా ఇంకా 278 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.  

  • Loading...

More Telugu News