Manipur CM: ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం

Bomb found near Manipur CM residence

  • తెగల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్
  • సీఎం నివాసం సమీపంలో మోర్టార్ బాంబు గుర్తింపు
  • బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు

రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. బీరేన్ సింగ్ నివాసానికి కొన్ని మీటర్ల దూరంలో ఈ తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబును గుర్తించిన సమయంలో బీరేన్ సింగ్ నివాసంలో లేరని తెలుస్తోంది.

మరోవైపు ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉండొచ్చని... అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News