President Of India: రాష్ట్రపతి ముర్ముకు హైదరాబాద్‌లో గవర్నర్, సీఎం ఘన స్వాగతం

President Murmu reached Hyderabad

  • హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి
  • ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో గవర్నర్, సీఎంతో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు.

రాష్ట్రపతి హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతి రేపు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News