INS Nirdeshak: విశాఖలో రేపు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం

Union minister for state Sanjay Seth will commission INS Nirdeshak tomorrow

  • హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు
  • వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక తయారీ
  • రేపు విశాఖ రానున్న కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్
  • ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రారంభోత్సవం

కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఇక్కడి నేవీ తూర్పు కమాండ్ కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు. 

ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ను కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) కంపెనీ నిర్మించింది. ఈ నౌక పొడవు 110 మీటర్లు... దీని బరువు 3,800 టన్నులు. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో ఈ నౌకకు రూపకల్పన చేశారు. 

2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ నౌక స్థానంలో ఈ కొత్త ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను తయారు చేశారు. 18 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన 25 రోజుల పాటు ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకత. 

హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ కీలకపాత్ర పోషించనుందని రక్షణ రంగ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News