TTD: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

TTD EO Reviews on Vaikunth Dwara Darshan Arrangements

  • 23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్ల విడుదల
  • 24న ఎస్ఈడీ టికెట్ల విడుదల
  • వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాల ప్రారంభం 

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీధర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలివే..

  • 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల
  • ⁠24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల‌‌.
  • జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్‌డీ టోకెన్లు కేటాయింపు.
  • తిరుపతిలో ఎం.ఆర్. పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.
  • టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం.
  • టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు.
  • వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం.
  • వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు.
  • వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం.
  • వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
  • గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.
  • వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.
  • ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ.
  • లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం.

  • Loading...

More Telugu News