Gabba Test: గబ్బా టెస్ట్: సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్.. భారత్‌ ముందు ఊరించే లక్ష్యం!

Australia declared second innings 89 and india target in 275 runs

  • 89/7 స్కోర్ వద్ద సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా
  • భారత్ లక్ష్యం 275 పరుగులుగా ఖరారు
  • బుమ్రా 3, సిరాజ్, ఆకాశ్ దీప్‌‌లకు చెరో 2 వికెట్లు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆతిథ్య జట్టు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు లభించిన 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా విజయలక్ష్యం 275 పరుగులుగా ఖరారైంది. 

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించారు. 89 పరుగులకే 7 వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో 2 చొప్పున వికెట్లు తీశారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్‌స్వీనీ 4, ఉస్మాన్ ఖవాజా 8, మార్నస్ లబుషేన్ 1, మిచెల్ మార్ష్ 2, ట్రావిస్ హెడ్ 17, స్టీవెన్ స్మిత్ 4, అలెక్స్ క్యారీ 20, ప్యాట్ కమ్మిన్స్ 22, మిచెల్ స్టార్క్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

కాగా, 275 పరుగుల లక్ష్యం భారత్‌ను ఊరించేదిగా ఉంది. మ్యాచ్‌కు చివరి రోజు కావడం, పిచ్ పేసర్లకు అనుకూలంగా మారడంతో లక్ష్య ఛేదన అంత సులభం కాదని చెప్పాలి. మరి, భారత్ బ్యాటర్లు మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి ఆడతారా? లేక దూకుడు ప్రదర్శిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News