Rashmika Mandanna: ప్రేమ, జీవితంలో తోడుపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Rashmika Mandanna on love

  • తనలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా కావాలన్న రష్మిక
  • ప్రేమ అంటే జీవిత భాగస్వామిని కలిగి ఉండటమేనని వ్యాఖ్య
  • తోడు లేకపోతే జీవితం వేస్ట్ అన్న రష్మిక

వరుస సినిమాలతో రష్మిక మందన్న దూసుకుపోతోంది. తాజాగా 'పుష్ప-2' ఘన విజయాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు, రష్మిక ప్రేమ, రిలేషన్ షిప్ పై చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందని చెపుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ... తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పుకుంటా వచ్చింది. తనలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తనకు జీవిత భాగస్వామిగా కావాలని ఆమె తెలిపింది. జీవితంలోని ప్రతి దశలో తనకు తోడుగా ఉండాలని... అన్ని వేళలా భద్రతను ఇవ్వాలని... కష్ట సమయంలో తనకు సపోర్ట్ గా ఉండాలని చెప్పింది. 

ఒకరిపై మరోకరు బాధ్యతగా ఉంటే జీవితాంతం కలిసి ఉండవచ్చని రష్మిక తెలిపింది. తన దృష్టిలో ప్రేమ అంటే జీవిత భాగస్వామిని కలిగి ఉండటమేనని చెప్పింది. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలని... తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. 

  • Loading...

More Telugu News