Jasprit Bumrah: గ‌బ్బా టెస్టులో జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. క‌పిల్ దేవ్ రికార్డు బ్రేక్‌!

Jasprit Bumrah Breaks Kapil Dev Record to Become Most Successful Indian Bowler in Australia

  • ఆసీస్ గ‌డ్డ‌పై అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా బుమ్రా
  • 10 మ్యాచుల్లో 52 వికెట్లు ప‌డ‌గొట్టిన స్టార్ పేస‌ర్‌
  • 11 మ్యాచుల్లో 51 వికెట్లు తీసిన క‌పిల్ దేవ్

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆ జ‌ట్టు ఓపెన‌ర్ ఉస్మాన్ ఖవాజాను క్లీన్‌బోల్డ్ చేయ‌డంతో పాటు మ‌రో బ్యాట‌ర్ మార్న‌స్ ల‌బుషేన్‌ను పెవిలియ‌న్ చేర్చ‌డంతో బుమ్రా కంగారుల గ‌డ్డ‌పై అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అవ‌త‌రించాడు. 

భార‌త దిగ్గ‌జం క‌పిల్ దేవ్‌ను వెన‌క్కి నెట్టి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆసీస్‌లో బుమ్రా 10 మ్యాచుల్లో (బ్రిస్బేన్ టెస్టుతో క‌లిపి) 52 వికెట్లు తీశాడు. క‌పిల్ 11 మ్యాచుల్లో 51 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ఇద్ద‌రి త‌ర్వాత ఆస్ట్రేలియాలో అత్య‌ధిక వికెట్లు సాధించిన భార‌త బౌల‌ర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (10 మ్యాచుల్లో 49 వికెట్లు), ర‌విచంద్ర‌న్ అశ్విన్ (11 మ్యాచుల్లో 40 వికెట్లు), బిష‌న్ సింగ్ బేడి (7 మ్యాచుల్లో 35 వికెట్లు) ఉన్నారు. 

కాగా, గ‌బ్బా టెస్టులో ఆతిథ్య జ‌ట్టు త‌న రెండో ఇన్నింగ్స్ లో 89/7 వ‌ద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొద‌టి ఇన్నింగ్స్ లో 185 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని టీమిండియాకు 275 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 


  • Loading...

More Telugu News