Russia-Ukraine: కిమ్ సైనికుల ముఖాలను రష్యా కాల్చేస్తోందన్న జెలెన్ స్కీ.. వీడియో ఇదిగో!

Russia Tries To Conceal Losses of North Korean Troops Says Zelensky

  • మృతదేహాలను గుర్తుపట్టకుండా ఉండేందుకేనని మండిపాటు
  • రష్యా కోసం ఉత్తర కొరియా జవాన్లు చనిపోతున్నారని వ్యాఖ్య
  • పుతిన్ మాత్రం వారి త్యాగాన్ని గౌరవించడంలేదని విమర్శలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ఎలాంటి సంబంధంలేకున్నా నార్త్ కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారని, తమ సైనికుల చేతిలో చాలామంది చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యా కోసం యుద్ధం చేస్తూ చనిపోయిన నార్త్ కొరియా సైనికుల పట్ల పుతిన్ కనీస గౌరవం కూడా చూపడంలేదని మండిపడ్డారు. చనిపోయిన ఉత్తర కొరియా సైనికులను గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహాల ముఖాలను కాల్చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కుర్స్క్‌ రీజియన్‌లో మృతదేహాలను పాతిపెట్టడానికి ముందు రష్యా సైనికులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈమేరకు ట్విట్టర్ లో జెలెన్ స్కీ ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో చనిపోయిన కొరియా సైనికుల ముఖాలను కాల్చినట్లు కనిపించింది. ‘ఉక్రెయిన్‌ పైకి ఉత్తర కొరియా సైనికులను పంపిస్తున్న పుతిన్.. ఆ సైనికుల త్యాగాలను అవమానిస్తున్నాడు. ఉత్తర కొరియా సైనికుల మరణాలను దాచడానికి రష్యా అనాగరిక చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి పిచ్చితనాన్ని ఇకనైనా ఆపాలి. దీనికి శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ఒక్కటే మార్గం’’ అని జెలెన్ స్కీ చెప్పారు.

  • Loading...

More Telugu News