Atharva Murali: 'ఆహా' తెరపైకి తమిళ థ్రిల్లర్ మూవీ!
- తమిళంలో రూపొందిన 'నిరంగల్ మూండ్రు'
- థ్రిల్లర్ జోనర్లో సాగే కథాకథనాలు
- దర్శకత్వం వహించిన కార్తీక్ నరేన్
- నవంబర్ 22న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 20 నుంచి 'ఆహా' తమిళ్ లో స్ట్రీమింగ్
తమిళంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా ఒకటి ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'నిరంగల్ మూండ్రు'. కరుణమూర్తి నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, నవంబర్ 22 న అక్కడి థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది.
అథర్వ మురళి .. శరత్ కుమార్ .. రెహమాన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. అమ్ము అభిరామి కీలకమైన పాత్రలో కనిపించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీ నుంచి 'ఆహా' తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు నుంచి 'ఆహా' తెలుగులోను స్ట్రీమింగ్ కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ కథలో మూడు ప్రధానమైన పాత్రలు ఉంటాయి. ఈ ముగ్గురికి కూడా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఎవరి సిద్ధాంతానికి తగినట్టుగా వారు నడచుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గురూ కూడా తమ సిద్దాంతాలను పక్కన పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులు ఏమిటి? వాటిని వారు ఎలా ఎదుర్కొంటారు? అనేదే కథ. చూడాలి మరి ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందో.