Harish Rao: ధర్నా పేరుతో ట్రాఫిక్ జాం చేసిన సీఎంపై సీవీ ఆనంద్ కేసు పెట్టాలి: హరీశ్ రావు

Harish Rao demand for case on CM Revanth Reddy

  • సీవీ ఆనంద్ తమపై లేనిపోని కేసులు పెడుతున్నారన్న హరీశ్ రావు
  • ధర్నా పేరుతో రేవంత్ రెడ్డి ట్రాఫిక్ జాంకు కారణమయ్యారని వ్యాఖ్య
  • ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరిపై కేసు నమోదు చేయాలన్న మాజీ మంత్రి

బీఆర్ఎస్ నేతలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లేనిపోని కేసులు పెడుతున్నారని, కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నగరంలో ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.

ట్రాఫిక్ జామ్ చేసినందుకు గాను చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సీఎంపై సీవీ ఆనంద్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమైనది నిజమే అయితే... చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే... ఈరోజు సీఎంతో పాటు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరి పైనా కేసు నమోదు చేయాలని సవాల్ చేశారు.

డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలి

అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు. స‌భ్యుల‌పై ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు రూలింగ్ బుక్ చూపించి చెప్పారని గుర్తు చేశారు.

సుద్దులు మాకు చెప్పడం కాదు వారి సహచర మంత్రికి కూడా చెప్పాలని సూచించారు. వెంకట్ రెడ్డి కమీషన్ లిస్ట్ చదవమంటే తానూ చదువుతానన్నారు. కొంతమంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలన్నారు.

  • Loading...

More Telugu News