Paritala Ravi: 18 ఏళ్ల తర్వాత పరిటాల రవి హత్య కేసు నిందితులకు బెయిల్
- ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- 2005లో అనంతపురం జిల్లాలో పరిటాల రవి హత్య
- ప్రధాన నిందితుడు సూరిని కాల్చి చంపిన భానుకిరణ్
2004లో జరిగిన పరిటాల రవి హత్య కేసులో నిందితులకు 18 ఏళ్ల తర్వాత బెయిల్ వచ్చింది. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పండుగ నారాయణరెడ్డి (ఏ 3), రేఖమయ్య (ఏ 4), రంగనాయకులు (ఏ 5), వడ్డే కొండ (ఏ 6), ఓబిరెడ్డి (ఏ 8)లకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగింది. ఈ కేసు అప్పుడు సంచలనం సృష్టించింది. కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరిని భానుకిరణ్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు సూరి జైలుకు వెళ్లాడు. అతను బెయిల్ మీద బయటకు వచ్చాక 2011 జనవరి 4న భానుకిరణ్ కాల్చి చంపాడు.