Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట

Sajjala Bhargava Reddy gets relief in AP High Court

  • సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు 
  • ఆ మేరకు నమోదైన కేసులపై హైకోర్టు విచారణ
  • కేసులు కొట్టివేయాలని కోరుతూ భార్గవరెడ్డి పిటిషన్
  • విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసిన హైకోర్టు

వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. 

భార్గవరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత లేని కేసు అని ఆయన కోర్టుకు తెలిపారు. ఎవరిపై అయితే పోస్టులు పెట్టారో... వారు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎవరో మూడో వ్యక్తి చెపితే కేసులు నమోదు చేశారని చెప్పారు. ఐటీ సెక్షన్స్ కు బదులుగా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని అన్నారు. 

ఈ క్రమంలో, బీఎన్ఎస్ సెక్షన్ 35 (3)కి అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను అప్పటి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News