KTR: తనపై కేసు నమోదు కావడంపై కేటీఆర్ స్పందన!

KTR demands to discuss Formula E car race case in Assembly

  • ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఏ1గా కేటీఆర్
  • శాసనసభలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్
  • సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని వ్యాఖ్య

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కేటీఆర్ ను ఏ1గా చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఏసీబీ కేసు నమోదైన సమయంలో కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. దీనిపై శాసనసభలో కేటీఆర్ స్పందించారు. ఏదో కుంభకోణం అన్నారుగా... ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఈ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని... సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News