Chandrababu: అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే అంశంపై చర్చ జరగాలి: సీఎం చంద్రబాబు

Chandrababu opines on Delhi developments

  • అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు!
  • పార్లమెంటులో రణరంగం
  • కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గుర్తింపు లభించలేదన్న చంద్రబాబు
  • అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అని వెల్లడి

ఢిల్లీలో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు పలు సూచనలు చేశారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని స్పష్టం చేశారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా, చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని తెలిపారు. వ్యవసాయం దండగ అని అనకపోయినా, నేను ఆ మాట అన్నట్టుగా ప్రచారం చేశారని చంద్రబాబు వెల్లడించారు. 

కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదని, అప్పట్లో అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అని గుర్తు చేశారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్ కు ఎవరిద్వారా గుర్తింపు వచ్చిందనే అంశంపై జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

కేంద్రమంత్రి అమిత్ షా... అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఇవాళ పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగి పలువురు ఎంపీలు గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయసేకరణ

ఇక. కూటమి ప్రభుత్వంలో ఉదాసీన వైఖరికి తావులేని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయ సేకరణ జరుపుతున్నానని తెలిపారు. మంత్రులు పనితీరు, ప్రభుత్వ పనితీరు పరంగా ప్రజల నుంచి సమాచారం తెప్పిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. 

ఆరు నెలల పనితీరుపై ముగ్గురు మంత్రులు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని వివరించారు. నిమ్మల రామానాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని తెలిపారు. మంత్రులు తమ పేషీలకు మాత్రమే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అంతేగాకుండా,  మంత్రులు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపు ధోరణి అనుసరించవ్దదని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News