Ram Charan: 'గేమ్ చేంజర్' కు రామ్ చరణ్ పర్ఫెక్ట్ ఛాయిస్: శంకర్

Shankar talks about bringing Ram Charan into Game Changer as lead role

  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్
  • తాజాగా ఆసక్తికర అంశాలు వెల్లడించిన శంకర్
  • రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమని కితాబు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 

ఈ క్రమంలో దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి, ఆ పాత్రకు రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని శంకర్ వివరించారు. శంకర్ ఏం చెప్పారంటే...

‘RRR రిలీజ్‌కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. నా కథలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కాబట్టి ఓ పెద్ద హీరో అయితే బాగుంటుందని అనుకుని రామ్ చరణ్‌తో ప్రయాణం ప్రారంభించాం.

రామ్ చరణ్‌ని చూస్తే... లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. టైం, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్పోటనం చెందుతుందా? అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు... అందుకే గేమ్ చేంజర్ కు రామ్ చరణ్ ను ఎంపిక చేసుకున్నాం" అని తెలిపారు.

కాగా, గేమ్ చేంజర్ చిత్రంలో అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించన్నారు. టీజర్‌లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న రామ్ చరణ్‌ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. రామ్ చరణ్‌తో పాటు గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, ఎస్‌ జె సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని 'జరగండి', 'రా మచ్చా', 'జానా హైరాన్ సా' పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. నాలుగో పాట అయిన 'డీహెచ్ఓపీ' డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ పాట ప్రోమో అందరినీ మెప్పించింది.

  • Loading...

More Telugu News