AUS vs IND: భారత్‌తో చివరి రెండు టెస్టులకు స్టార్ ప్లేయర్‌ను తప్పించిన ఆసీస్.. యువ ఆటగాడికి చోటు
- భారత్‌తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన
- ఓపెనర్ మెక్‌స్వీనీ తప్పించి యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు చోటు
- గాయం కారణంగా స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ జట్టుకు దూరం
- జే రిచర్డ్‌సన్‌తో పాటు సీన్ అబాట్, బ్యూ వెబ్‌స్టర్‌లకు జట్టులో చోటు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో మెల్‌బోర్న్, సిడ్నీలో జరిగే నాలుగో, ఐదో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, స్టార్ ప్లేయర్, ఓపెనర్ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ జట్టు నుంచి తప్పించింది.
అతని స్థానంలో 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు చోటు కల్పించింది. దీంతో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఈ యంగ్ ప్లేయర్ ఓపెనింగ్ చేయనున్నాడు. కాగా, పింక్-బాల్ టెస్ట్‌కు ముందు కాన్‌బెర్రాలో టీమిండియాతో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ XI ప్రాక్టీస్ మ్యాచులో కొన్‌స్టాస్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అలాగే గాయం కారణంగా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జే రిచర్డ్‌సన్‌తో పాటు సీన్ అబాట్, బ్యూ వెబ్‌స్టర్‌లకు జట్టులో చోటు దక్కింది. ఈ మేరకు నాలుగు కొత్త ఎంపికలతో క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ జట్టును ప్రకటించారు.
స్కాట్ బోలాండ్, జే రిచర్డ్‌సన్ ఇద్దరిలో ఒకరు ఆస్ట్రేలియా తరపున ప్లేయింగ్ XIలో జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ఆడతారని జార్జ్ బెయిలీ పేర్కొన్నారు.
చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, సామ్ కొన్‌స్టాస్, అలెక్స్ కెరీ, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జే రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లీష్.