Chairman: వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు

Visakha Dairy chairman and 12 directors resign to YSRCP

  • వైసీపీని వరుసగా వీడుతున్న నేతలు
  • విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ రాజీనామా
  • వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నాన్న ఆనంద్ కుమార్

అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి రోజు ఎవరో ఒకరు పార్టీకి గుడ్ బై చెపుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు వైసీపీని వీడారు. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి వీడ్కోలు పలికారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు.

ఆనంద్ తో పాటు 12 మంది డెయిరీ డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో వరాహ వెంకట శంకర్రావు, పిల్లా రమా కుమారి, కోళ్ల కాటమయ్య, శీరంరెడ్డి సూర్యనారాయణ, ఆరంగి రమణబాబు, రెడ్డి రామకృష్ణ, దాడి పవన్ కుమార్, పరదేశి గంగాధర్, సుందరపు ఈశ్వర్, చిటికెల రాజకుమారి తదితరులు ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.

  • Loading...

More Telugu News