Revanth Reddy: కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ. 600 కోట్లు: రేవంత్ రెడ్డి

KTR agreement value is Rs 600 Cr says Revanth Reddy

  • ఈ-కార్ రేసింగ్ ప్రతినిధులు తనను కలిశారన్న రేవంత్
  • రూ. 600 కోట్ల డబ్బులు రావాల్సి ఉందని చెప్పారన్న సీఎం
  • తానను జాగ్రత్త పడటం వల్ల రూ. 450 కోట్లు మిగిలాయని వ్యాఖ్య

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై శాసనసభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టంచారు. స్పీకర్ పోడియంలోకి కూడా దూసుకుపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై చర్చించాలని ఇంతకాలం కేటీఆర్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 

ఈ-కార్ రేసింగ్ ప్రతినిధులు తనను కలిశారని... రూ. 600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉందని... వాటిని ఇవ్వాలని అడిగారని రేవంత్ చెప్పారు. మీరు ఓకే అంటే మరోసారి రేసింగ్ నిర్వహిస్తామని చెప్పారని తెలిపారు. ఎఫ్ఈవో ప్రతినిధులు తనను కలిసిన తర్వాతే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. 

కార్ రేస్ నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం రూ. 600 కోట్ల విలువైనదని రేవంత్ అన్నారు. పెండింగ్ డబ్బుల కోసం నిర్వాహకులు తన వద్దకు వచ్చినప్పుడే ఆ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తాను జాగ్రత్త పడటం వల్ల రూ. 450 కోట్లు మిగిలాయని అన్నారు. ఈ విషయంపై ఏసీబీ విచారణ జరుగుతోందని అన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోందని... అందువల్ల తాను ఎక్కువ మాట్లాడడంలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News