Ramcharan: డల్లాస్‌లో దిగిన రామ్‌చరణ్, సుకుమార్.. అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం
- ఇవాళ టెక్సాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- చీఫ్ గెస్ట్‌గా దర్శకుడు సుకుమార్
- సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల కానున్న మూవీ
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ డల్లాస్ చేరుకున్నారు. వారికి అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇవాళ టెక్సాస్‌లోని గార్లాండ్‌లో ఉన్న కర్టిస్ కల్వెల్ సెంటర్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా, తమన్ బాణీలు అందించారు.
వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.