Chaganti: చాగంటికి మరో బాధ్యతను అప్పగించిన ఏపీ ప్రభుత్వం

AP govt gave additional responsibilities to Chaganti

  • విద్యార్థులు - నైతిక విలువల సలహాదారుగా చాగంటి నియామకం
  • ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన చాగంటి
  • విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు పుస్తకాలు తయారు చేసే బాధ్యతను అప్పగించిన ప్రభుత్వం

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు - నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. కేబినెట్ హోదా కలిగిన ఈ బాధ్యతలను ఆయనకు ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు. 

తాజాగా చాగంటికి ఏపీ ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు చాగంటితో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించి, విద్యార్థులకు పంపీణీ చేయనుంది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు చాగంటికి అదనపు బాధ్యతలను అప్పగించారు. 

ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు చాగంటి తెలిపారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని చెప్పారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని... తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలని అన్నారు.

  • Loading...

More Telugu News