offbeat: తనే పడేసి, తనపైనే పడినట్టు... ఉడుత ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. వైరల్ వీడియో ఇదిగో!
- పెంపుడు జంతువులు ఉంటే ఆ సరదానే వేరు!
- మనుషుల్లో కలిసిపోయి అవి చేసే చేష్టలతో ఎంతో వినోదం
- అలాంటి ఓ ఉడుత చేసిన పనిపై అవాక్కవుతున్న నెటిజన్లు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఎక్కడైనా ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ సరదానే వేరు. మనుషులలో కలిసిపోయి, మనం నేర్పినట్టుగా నేర్చుకుని అవి చేసే చేష్టలతో ఎంతో వినోదం కూడా. కానీ సొంతంగా తెలివితేటలు చూపుతూ కొన్ని పెంపుడు జంతువులు చేసే పనులు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నిసార్లు ఎంతో ఆసక్తి రేపుతాయి. అలాంటిదే ఈ వీడియో.
ఆడుకుంటూ పడేసి..
- ఓ పెంపుడు ఉడుత ఇంట్లో ఆడుకుంటూ... ప్లాస్టిక్ చీపురును కింద పడేసింది. అక్కడితో ఊరుకోకుండా... అదేదో తనపైనే పడినట్టు చూపేలా ప్లాన్ చేసుకుంది. మెల్లగా వచ్చి ఆ చీపురును పైకి లేపి తనపై వేసుకుంది. అది కూడా చాలదన్నట్టు దాన్ని తన మెడపైకి జరుపుకొంది. ఆ తర్వాత దెబ్బతగిలి పడిపోయినట్టుగా కాళ్లు బార్లా చాపి ఫోజు పెట్టింది.
- కేవలం 24 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- ‘ఎక్స్’ లోని అమేజింగ్ నేచర్ పేరిట ఉన్న ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా కేవలం మూడు రోజుల్లోనే 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
- ఈ వీడియో చూసినవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉడుతది మామూలు నటన కాదు ఆస్కార్ లెవల్ యాక్టింగ్..’ అంటూ కామెంట్లు వస్తున్నాయి.