Bangladesh: బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పాలంటూ ఢిల్లీ స్కూళ్లకు సర్క్యులర్

Circular issued to identify illegal Bangladeshi students in Delhi schools

  • అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్
  • వలసదారులను గుర్తించాలని ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్న వలసదారుల సమస్య

స్కూళ్లలో బంగ్లాదేశ్ కు చెందిన పిల్లలు ఉంటే వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్ లను చేపట్టామని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.

ఢిల్లీలో ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య వలసదారుల సమస్య కీలకం కానుంది. 

  • Loading...

More Telugu News