Eknath Shinde: కీలకమైన హోంశాఖను తన వద్దే ఉంచుకున్న మహా సీఎం ఫడ్నవీస్

eknath shinde gets 3 maharashtra ministries but not home

  • మహాయుతి సర్కార్‌లో మంత్రులకు శాఖలు కేటాయింపు 
  • డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేకి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, ప్రజా పనుల శాఖలు 
  • మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్ధిక శాఖ, ఎక్సైజ్ శాఖలు

ఇటీవలే మహారాష్ట్రలో కొలువుదీరిన మహాయుతి ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలకమైన హోం మంత్రిత్వ శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అంతే కాకుండా సాధారణ పరిపాలన, విద్యుత్, న్యాయ, సమాచార పౌర సంబంధాల శాఖలు సైతం ఫడ్నవీస్ తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ కీలక శాఖలను ఎవరికీ అప్పగించలేదు. 

ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేకి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, ప్రజా పనుల శాఖలను కేటాయించారు. మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్ధిక శాఖ, ఎక్సైజ్ శాఖలను అప్పగించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులేకు మరో కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. 

రాధాకృష్ణకు జలవనరులు (గోదావరి - కృష్ణ లోయ అభివృద్ధి కార్పొరేషన్) శాఖ, హసన్ మియాలల్ కు వైద్య విద్య, చంద్రకాంత్ సరస్వతికి ఉన్నత, సాంకేతిక విద్య, శాసనసభ వ్యవహారాలు, గిరీశ్ గీతా దత్తాత్రేయ మహాజన్ కు జలవనరులు (విదర్భ, తాపీ, కొంకణ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్), విపత్తు నిర్వహణ శాఖలను కేటాయించారు. 

గణేశ్ నాయక్‌కు అడవులు, గులాబ్రావ్ పాటిల్‌కి నీటి సరఫరా, పారిశుధ్యం, దాదాజీ రేష్మాబాయి దగదుజీ బూసేకి పాఠశాల విద్య, సంజయ్ రాథోడ్‌కి నేల, నీటి సంరక్షణ, ధంజయ్ ముండేకి ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంగళ్ ప్రభాత్ లోథా - నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఉదయ్ సమంత్‌కి పరిశ్రమలు, మరాఠీ భాష, జయకుమార్ రావల్‌కి మార్కెటింగ్, ప్రోటోకాల్, పంకజా ముండేకి పర్యావరణం, వాతావరణ మార్పు, జంతు సంరక్షణ అతుల్ సేవ్, ఓబీసీ సంక్షేమం, డెయిరీ డెవలప్ మెంట్, అశోక్ ఉయికే‌కి గిరిజన అభివృద్ధి, శంభురాజ్ దేశాయ్‌కి టూరిజం, మైనింగ్ శాఖలను కేటాయించారు. 

దత్తాత్రే భరణేకి క్రీడలు, యువజన సంక్షేమం, శివేంద్ర సింగ్ భోసలేకి పబ్లిక్ వర్క్స్, వ్యవసాయం, జయకుమార్ గోరేకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నరహరి జిర్వాల్‌కు ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, సంజావ్ శిర్సత్‌కు సామాజిక న్యాయం, ప్రతాప్ సర్నాయక్‌కు రవాణా, భరత్ శేత్ గోగావాలే‌కి ఉపాధి హామీ, ఉద్యానవన, మకరంద్ జాదవ్‌కు రిలీఫ్, రిహాబిలిటేషన్, నితీశ్ రాణేకి ఫిషరీస్, ఓడరేవులు, అకాశ్ ఫండ్కర్‌కు కార్మిక శాఖ, బాబాసాహెబ్ పాటిల్‌కు సహకారం, ప్రకాశ్ అబిత్కర్‌కు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖలను కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.   

  • Loading...

More Telugu News