Daggubati Purandeswari: ఆ ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదు: పురందేశ్వరి

Purandeswari came into support for Allu Arjun

  • సంధ్య థియేటర్ తొక్కిసలాటపై నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం
  • అల్లు అర్జున్ దే తప్పంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ కు మద్దతుగా పురందేశ్వరి వ్యాఖ్యలు
  • ఆ ఘటన అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదని స్పష్టీకరణ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆ సినిమాలో హీరో కాబట్టి అల్లు అర్జున్ పుష్ప-2 ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వచ్చాడని అన్నారు. ఆ తొక్కిసలాట ఘటన ఆయన ప్రేరేపించింది కాదని పేర్కొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11 గా ఉన్నారని, అలాంటప్పుడు మిగతా వాళ్లను కాకుండా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. 

తొక్కిసలాట ఘటనపై నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాడీవేడి ప్రసంగం చేయడం తెలిసిందే. ప్రధానంగా అల్లు అర్జున్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందంటూ ఆరోపణలు చేశారు. 

రేవంత్ వ్యాఖ్యలకు స్పందనగా అల్లు అర్జున్ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, చేయని తప్పులు తనకు ఆపాదిస్తున్నారని అల్లు అర్జున్ వాపోయారు. ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మామిడిపాలెం రోడ్డులో ఈ రోజు కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహం భూమి పూజ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ ఇష్యూపై స్పందన కోరగా, ఆమె తాజా వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News