Cricket: భారత క్రికెటర్లలో... ఎవరెవరికి సొంత విమానాలు ఉన్నాయో తెలుసా?
- భారత క్రికెటర్లకు ఆటతోపాటు బయట కూడా భారీగా ఆదాయం
- వందల కోట్ల ఆస్తులున్న క్రికెటర్లు ఎందరో...
- అందులో కొందరికి సొంతంగా జెట్ విమానాలు ఉన్నాయని తేల్చిన జాతీయ మీడియా
భారత్ లో క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. అందుకే క్రికెటర్లకు ఆటతో పాటు బయట కూడా విపరీతంగా ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ప్రకటనకర్తలు యాడ్స్ కోసం వారి వెంటపడుతుంటారు. కోట్లకు కోట్లు ఇస్తుంటారు. ఇలా కొందరు క్రికెటర్లు వందల కోట్ల ఆదాయం సంపాదించినట్టు జాతీయ మీడియా తేల్చింది. అందులో కొందరు సొంతంగా చిన్నపాటి జెట్ విమానాలు కొనుక్కున్నట్టూ గుర్తించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం...
విరాట్ కోహ్లీ... ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ స్థానమేంటో అందరికీ తెలిసిందే. ఆయనకు సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది. అన్ని రకాల సదుపాయాలతో ఉన్న ఈ విమానంలో ఫ్యామిలీతో కలసి టూర్లు వేస్తుంటారట.
మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో భారత్ కు ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన మేటి క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయనకు ప్రైవేట్ జెట్ ఉందని జాతీయ మీడియా చెబుతోంది.
కపిల్ దేవ్... భారత్ కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన లెజెండరీ క్రికెటర్ ఈయన. ఆయనకూ ప్రైవేట్ జెట్ ఉందట.
హార్దిక్ పాండ్యా... భారత క్రికెట్ అభిమానుల్లో హార్దిక్ పాండ్యా పేరు విననివారెవరూ ఉండరు. ఒక దశలో టీమిండియా వైస్ కెప్టెన్ గా కూడా ఉన్న పాండ్యాకూ సొంతంగా జెట్ విమానం ఉందని జాతీయ మీడియా చెబుతోంది.
సచిన్ టెండూల్కర్... క్రికెట్ దేవుడిగా పేరు పొందిన అసాధారణ క్రికెటర్ సచిన్. భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచస్థాయిలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ధనిక క్రికెటర్లలోనూ ఒకరైన సచిన్ కు సొంతంగా విమానం ఉందట.
వీళ్లు మాత్రమే కాకుండా... ఇంకా మరికొందరు క్రికెటర్లకు కూడా ప్రైవేటు జెట్ విమానాలు ఉన్నాయి. అయితే వారి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందని జాతీయ మీడియా పేర్కొంది.