PV Sindhu: ఘ‌నంగా పీవీ సింధు వివాహం

PV Sindhu Married Venkata Datta Sai in Rajasthan

  • పెళ్లి బంధంతో ఒక్క‌టైన పీవీ సింధు, వెంక‌ట ద‌త్త‌సాయి
  • ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టిన జంట‌
  • ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు
  • రేపు హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్  

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉద‌య్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు ఘ‌నంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె ఏడ‌డుగులు వేసింది. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉద‌య్‌సాగ‌ర్ స‌ర‌స్సులో ఉన్న ర‌ఫ‌ల్స్ హోట‌ల్ ఈ వివాహ వేడుక‌కు వేదిక‌గా నిలిచింది. పెళ్లి ఫొటోల‌ను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుద‌ల చేయ‌లేదు. రేపు హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. 

  • Loading...

More Telugu News