Game Changer: ఇండియాకు ప‌య‌న‌మైన 'గేమ్ చేంజర్' టీమ్

Game Changer team has Departed for India after an Extravagant Game Changer Global Event in Dallas
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ చేంజ‌ర్‌' 
  • జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
  • డాలస్ లో ఆదివారం నాడు ఘనంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ 
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ 
  • మెగా ఈవెంట్ ముగిసిన అనంత‌రం మూవీ టీమ్ ఇండియాకు తిరుగు ప‌య‌నం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న 'గేమ్ చేంజర్' చిత్రం సంక్రాంతి కానుక‌గా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు షురూ చేసింది. దీనిలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 'ఛరిష్మా డ్రీమ్స్' రాజేశ్ కల్లేపల్లి ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్ న‌గ‌రంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ద‌ర్శ‌కుడు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే నిర్మాత దిల్ రాజు, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ ఫ్యామిలీ, హీరో రామ్ చ‌ర‌ణ్‌, ఇత‌ర చిత్రబృందం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

ఇక ఈ మెగా ఈవెంట్ ముగిసిన అనంత‌రం 'గేమ్ చేంజర్' టీమ్ ఇండియాకు తిరుగు ప‌య‌న‌మైంది. ఈ మేర‌కు చిత్ర‌బృందం ఓ ఫొటోను పంచుకుంది. ఫొటోలో చెర్రీ, నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌, ద‌ర్శ‌కుడు బుచ్చి‌బాబు, న‌టుడు ఎస్‌జే సూర్య‌, ఇత‌రులు ఉన్నారు. 

కాగా, 'గేమ్ చేంజర్'లో చెర్రీ స‌ర‌స‌న కియారా అద్వాణీ హీరోయిన్‌గా న‌టించ‌గా, త‌మ‌న్ స్వ‌రాలు అందించారు. వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు దీనిని నిర్మించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటించారు. 
Game Changer
Ramcharan
Dallas
Tollywood

More Telugu News