Low Pressure: అల్పపీడనం తీరానికి దగ్గరగా వచ్చింది... మరో రెండ్రోజులు ఇవే పరిస్థితులు: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం

Visakha Cyclone Warning Center issues latest bulletin on low pressure

  • దిశ మార్చుకున్న అల్పపీడనం
  • అల్పపీడనం బలహీనపడిందన్న విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం
  • ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడి
  • 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరణ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. దీనిపై విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వివరాలు తెలిపింది. 

అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని వెల్లడించింది. తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. మరో రెండ్రోజుల పాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వివరించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, విశాఖ పోర్టులో మూడో నెంబరు సాధారణ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

  • Loading...

More Telugu News