KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు క్వాష్ పిటిషన్లు

KCR and Harish Rao files quash petition in HC
  • మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టులో పిటిషన్
  • కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసిన కోర్టు
  • ఈ నోటీసులు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు
మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత జులై 10న కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని వారు తాజాగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. 
KCR
Telangana
Harish Rao
BRS

More Telugu News